హైదరాబాద్‌లో వర్షం తగ్గుముఖం

హైదరాబాద్‌: నగరంలో శుక్రవారం మధ్యాహ్నంనుంచి శనివారం వరకు కురిసిన వర్షం తగ్గుముఖం పట్టింది. రోడ్లపై వున్న  నీరు తగ్గడంతో నగరంలోని పలుకాలనీల్లో వర్షపునీటి ప్రవాహం తగ్గింది. ఇదిలావుండగా వ్యాధులు వ్యాపించకుండా లోతట్టు ప్రాంతాల్లో నగరపాలక అధికారులు చర్యలు ప్రారంభించారు.