హైదవ సంస్కృతిపై టీఆర్ఎస్ సర్కార్ దాడి

ఆంక్షలు  :    రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్.
నిబంధనల పేరుతో హిందూవుల పండుగలకు అడ్డంకులు
 ఎల్బీ నగర్ (జనం సాక్షి  )    సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందూవులందరిపై ఉందని  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు  .మంగళవారం నాడు   మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం గుమ్మడివెల్లి తండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో తుల్జాభవాని అమ్మవారి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చెవ్వెళ్ల పార్లమెంట్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి శ్రీరాములు అందెల హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ… గ్రామాల్లో మన సంస్కృతిని కాపాడుకునేందుకు ఆలయాలను పార్టీలకతీతంగా సంఘటితంగా నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. హిందూవుల పండుగలకు టీఆర్ఎస్ సర్కార్ అనేక ఇబ్బందులు సృష్టిస్తూ… యువకులను వేధిస్తున్నారని మరోసారి ఆరోపించారు అందెల శ్రీరాములు. తండావాసులందరూ కలిసికట్టుగా తుల్జాభవాని అమ్మవారి దేవాలయం నిర్మించుకోవటం సంతోషమన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అందెల శ్రీరాములు. ఈ కార్యక్రమంలో కందుకూర్ మండల అధ్యక్షులు అశోక్ గౌడ్, ఎంపీటీసీ రేఖా బాబురావు, సర్పంచి ప్రభాకర్, ఉపసర్పంచి జీవితామహేందర్, జీఎస్ నిమ్మ అంజిరెడ్డి, బ్యాంకు డైరెక్టర్ పర్వతాలు, ఎకుల మల్లేశ్, జంగారెడ్డి, జ్యోతి, బాబురావు, సురేశ్, వెంకటేశ్, ఆలయ నిర్వాహుకులు చౌహాన్, కిరణ్, గణేశ్, అంజి, శివ తదితరులు పాల్గొన్నారు.
Attachments area