¬దా ఉద్యమ కేసులు ఎత్తివేయాలి: కెవిపి

అమరావతి,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ప్రత్యేక ¬దాపై పోరాడిన వారిపై పోలీసులు పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ కెవీపీ రామచంద్రరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈ మేరకు రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు. నాలుగేళ్ల పాటు భాజపాతో కలిసి ఉన్నా
/-రత్యేక ¬దా సాధనలో చంద్రబాబు ఘెరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. దీని కోసం చేసిన పోరాటాలను అణచి వేశారని లేఖలో ఆరోపించారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి కూడా కేంద్రంపై ఒత్తిడి చేయకుండా.. ¬దా కోసం పోరాటం చేస్తోన్న కాంగ్రెస్‌ను విమర్శించడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రత్యేక ¬దాపై తొలి సంతకం పెడతానని రాహుల్‌ స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు.

తాజావార్తలు