*అంగన్వాడి కేంద్రాలు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలి.

 చిట్యాల సెప్టెంబర్14 (జనంసాక్షి) అంగన్వాడి కేంద్రంలో కేవలం పాలు, గుడ్లు అందించేవి కావని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జూకల్ గ్రామములో పోషకాహార మాసోత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీపీ దావు వినోద రెడ్డి,  సిడిపిఓ  అవంతిక పాల్గొన్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గర్భవతులకు శ్రీమంతాలు చేసి, ఆరు నెలలు నిండిన బాబుకు ఎమ్మార్వో శ్రీనివాస్ ఎంపీడీవో రామయ్య కలిసి అన్నప్రాసన చేశారు. అనంతరం సిడిపిఓ అవంతిక మాట్లాడుతూ మహిళలలో,  కిశోర బాలికలు,  పిల్లలలో  రక్తహీనత పోషకాహార లోపం తగ్గించడం. ఆహారంలో తీసుకోవలసిన సమతుల ఆహారం గురించి వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత వయసుల వారీగా పిల్లలకు ఇవ్వవలసిన ఆహారపు అలవాట్లు పెరగాల్సిన బరువులు ఎత్తుల గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్ ,ఎంపీటీసీ తిరుపతి, అంగన్వాడి సూపర్వైజర్ జయప్రద, టీచర్స్, తల్లులు పాల్గొన్నారు.