అంగన్వాడి కేంద్రాల ఆకస్మిక తనిఖీ

 

బోనకల్ ,నవంబర్ 11 (జనం సాక్షి):
బోనకల్ మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను ఖమ్మం డిడబ్ల్యూఓ పి డి సంధ్యారాణి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇందులో భాగంగా బోనకల్ గ్రామంలోని అంగన్వాడీ 1, 4 , 5 సెంటర్ల ను తనిఖీ చేసి పలు
రిజిస్టర్లను, సెంటర్లో ఉండాల్సిన స్టాకును, పిల్లలకు అందిస్తున్న పౌష్టిక ఆహార నిలువలను సమీక్షించారు. పిల్లల యొక్క ఎత్తు, బరువలను చూశారు, అదే విధంగా మెనూ ప్రకారం వండవలసిన ఆహారాన్ని పరిశీలించారు ,లబ్ధిదారులకు అందుతున్న సేవలను గురించి అక్కడికి వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ,మహిళలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిడి సంధ్యారాణి చేతుల మీదుగా పలువురు లబ్ధిదారులకు బాలామృతం, పాలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిడబ్ల్యుఓ పీ డీ సంధ్యారాణి మాట్లాడుతూ అంగనవాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలను ప్రజలు వందశాతం వినియోగించుకునేలా కృషి చేయాలన్నారు. కేంద్రాలకు వచ్చే బాలబాలికలకు ఆటపాటలతో నర్సరీ విద్యను అందించాలన్నారు. గర్భిణులు, బాలింతలకు మెనూ ప్రకారం అన్ని పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందించాలన్నారు.అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారంతో చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ పి డి సంధ్యారాణి, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ హిమబిందు,ఏసీడిపిఓ కమల ప్రియ ,సూపర్వైజర్ రమాదేవి , అంగన్వాడి టీచర్లు శిరీష, రమాదేవి, నాగమణి ,ఆయాలు తదితరులు పాల్గొన్నారు.