అంగన్వాడి సెంటర్లో పౌష్టిక ఆహారం పంపిణీ. సర్పంచ్ కొండ గణేష్.

మండలంలోని వెన్కేపల్లి అంగన్వాడి సెంటర్లో శుక్రవారం సర్పంచ్ కొండ గణేష్ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పిల్లలకు,గర్భిణీ స్త్రీలకు సంబంధించి పోషక ఆహరం పంపిణీ పై ఆరా తీశారు.ఆహారంలో సమతుల్యత, వైవిద్యం,పరిమితంగా ఉండే విధంగా చూసుకోవలన్నారు.కేలరీలు శృతిమించకుండా ఒకే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకుండా ఆహార నియమాలను పాటించి ఆరోగ్యాలను కాపాడుకోవలన్నారు. పిల్లలకు తల్లి పాలు 2 సంవత్సరాల వరకు తప్పకుండా ఇవ్వాలి అన్నారు. ఆకు కూరలు,కూరగాయలు,పండ్లు నిత్యం ఆహారంలో తీసుకోవాలన్నారు. నీళ్లను ఎక్కువగా తాగాలి,శుభ్రమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి అన్నారు.అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త కొత్త సులోచన వార్డు సభ్యులు గడ్డం శేఖర్,కనుకుంట్ల రాజు,ఆయా అనిత గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు