అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెపై కనికరం లేని ప్రభుత్వం

టేకులపల్లి, సెప్టెంబర్ 28( జనం సాక్షి): 18 రోజుల నుండి అంగన్వాడి ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలపై నిరవధికంగా సమ్మె చేపడుతున్న అంగన్వాడీలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కనికరం కూడా లేదని, వారి చావు వారిని చావనివ్వండని చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించే ధోరణి ఏమాత్రం కనిపించకపోవడం విచారకరమని ఏఐటియుసి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు సిహెచ్ సీతామహాలక్ష్మి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో 18వ రోజు నిరవధిక సమ్మె కొనసాగుతుండడంతో ఈ శిబిరాన్ని ఆమె సందర్శించి మాట్లాడారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ల సమ్మెపై ప్రభుత్వానికి కనికరం లేదు. అంగన్వాడీల వేతనాలు పెంచాలని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు 10 లక్షలు హెల్పర్లకు ఐదు లక్షలు ఇవ్వాలని తదితర డిమాండ్స్ పరిష్కరించాలని అంగన్వాడీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల మంది టీచర్స్ హెల్పర్స్ నిరవధిక సమ్మె చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగులను, హెల్పర్లను తొలగిస్తాం అని భయపెట్టడం సరైన పద్ధతి కాదని పోరాడే సంఘాలను చర్చలకు పిలవకపోవడం అప్రజాస్వామికం అని అన్నారు. సమస్యలను పరిష్కారం కోసం పోరాటాన్ని మరింత ఉదృతం చేయాలని అంగన్వాడి టీచర్స్, హెల్పర్లకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు తక్షణమే పిలవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు పద్మ, వై ఇందిరా, కొండపల్లి శకుంతల,వై పద్మావతి,వి సంధ్యారాణి, ఎన్ విజయలక్ష్మి,ఎం నాగమణి,టి వరమ్మ, జి పద్మ, శివ కుమారి,వి రాజేశ�