అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం
మండల పరిధిలోని రావినూతల అంగన్వాడి -4 కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం సందర్భంగా పోషణ్ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఏ సి డి పి ఓ వీరభద్రమ్మ సూపర్వైజర్ రమాదేవిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ శివ నాగేంద్ర మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. పుట్టిన పిల్లలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి, వివరించారు. మహిళలకు కిషోర బాలికలకు రక్తహీనత గురించి వివరించడం జరిగినది. అంగన్వాడికి వచ్చే పిల్లలకు ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆహారం అందించాలని అలాగే బాలామృతాన్ని కూడా అందించడం వలన పిల్లలు సాధారణ బరువును వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ కే సునీత ఆయా పార్వతి గర్భిణీ స్త్రీలు బాలికల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.