అంగన్‌వాడీ కేంద్రం పరిశీలించిన సర్పంచ్‌

ఏలూరు, నవంబర్‌30 (జనం సాక్షి) : అంగన్‌వాడీ కేంద్రాల పూర్వ ప్రాథమిక విద్యతో పాటు తల్లులు, గర్భిణీ, బాలింత, కిశోర బాలికలకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎంపిడిఒ ఎవి విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం గోపీనాథపట్నంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సర్పంచి, మండల సర్పంచుల ఛాంబర్‌ అధ్యక్షుడు పుత్సకాయల విష్ణుమూర్తి, పంచాయతీ కార్యదర్శి సందర్శించారు. ఎంత మంది చిన్నారులున్నారు, వారికి పూర్వ ప్రాథమిక విద్య ఎలా అందిస్తున్నారో ఆరా తీసి రికార్డులను పరిశీలించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నామని అంగన్‌వాడీ కార్యకర్త గీతాంజలి తెలపగా క్షేత్రస్థాయి పరిశీలనలో ఎంపిడిఒ, సర్పంచులు సంతృప్తి వ్యక్తం చేశారు.