అంగరంగ వైభవంగా బ్ర¬్మత్సవాలు
హనుమంత వాహనసేవపై ఊరేగిన శ్రీవారు
తిరుమల,సెప్టెంబర్18(జనంసాక్షి): కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి బ్ర¬్మత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో భక్తకోటి పులకించింది. బ్ర¬్మత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం మలయప్పస్వామి హనుమంత వాహనంపై విహరించారు. హనుమంత వాహనంపై విహరించిన స్మామి వారి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు.భగవత్ భక్తులలో అగ్రగణ్యడు హనుమంతుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. హనుమంతున్ని స్మరిస్తే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, ఆరోగ్యం సిద్ధిస్తాయి. హనుమంత వాహనంసందర్బంగా సాంస్కృతిక వేడుకలు ఆకట్టుకున్నాయి. భక్తుల కోలాహలం మిన్నంటింది. కోలాటాలు భజనలు ఆకట్టుకున్నాయి. అలాగే బ్ర¬్మత్సవాల్లో భాగంగా రాత్రి గజవాహనంపై స్వామివారు విహరించారు. సోమవారం రాత్రి వైభవంగా జరిగిన గరుడోత్సంలో దేవదేవుని కనులారా తిలకించి తరించింది. రాత్రి 7 గంటల నుంచి వాహనసేవ ప్రారంభమై..అర్ధరాత్రి వరకు నయనానందకరంగా సాగింది. నలుదిక్కులా కిక్కిరిసిన భక్తులకు అభయప్రదానం చేస్తూ.. చతుర్మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామి విహరించారు. శ్రీవారి మూలవిరాట్టుకు అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, వేంకటేశ సహస్రనామమాల వంటి విశేష తిరువాభరణాలతో శ్రీమలయప్పస్వామి దేదీప్యమానంగా వెలుగొందారు. గరుడసేవకు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం స్వామివారు జగన్మోహిని రూపంలో దంతపల్లకి వాహనంపై ఊరేగారు.