అంగారకయాత్రకు రంగం సిద్ధం

మైసూర్‌: అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది నవంబరుకల్లా భారత్‌ అంగారకయాత్ర చేపడుతుంది, ఇస్రో ఛైర్మన్‌, స్పేన్‌ డిపార్ట్‌మెంట్‌ సక్రెటరీ అయిన కె. రాధాకృష్ణన్‌ ఈ విషయం స్పష్టలం చేశారు. అంగారకయాత్రపై ఎంతో అధ్యయనం జరుగు తోందన్నారు. ఈ అధ్యయనంలో దాదాపు చివరిదశకు వచ్చామని. త్వరతోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని భావిస్నున్నానని రాధాకృష్ణన్‌ తెలిపారు. దీనికి సంబంధించి ప్రాజెక్లు రిపోర్టును ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు సమాచారం. పీఎన్‌ఎల్‌వీ సహయంతో మార్స్‌ చుట్టూ తిరిగేలా ఒక ఆర్బిటర్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టాలన్నది లక్ష్యం. దాంట్టో వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిచే పరికరాలుంటాయి.