అంటువ్యాధులు సోకుండా చర్యలు చేపట్టాలి
ఆదిలాబాద్, జూన్ 13 (జనంసాక్షి): వర్షాకాలం వచ్చినందున జిల్లాలోని మారుమూల గ్రామాల్లో అంటు వ్యాధులు సోకకుండా తగు చర్యలు చేపట్టడమే కాకుండా ప్రజలకు వైద్య సేవలు అందించేలా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 469 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న వైద్యులు 127 మంది మా త్రమే ఉండగా, 45 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే 10 మంది వైద్యులు ఉన్నత చదు వుల కోసం ప్రభుత్వ అనుమతి పొందివున్నారు. మరో ఆరుగురు వైద్యులు ఉన్నత చదువుల కోసం దర ఖాస్తులు చేసుకున్నట్లు తెలిసింది. వర్షాకాలంలో గిరిజన గ్రామాల్లో వందలాది మంది గిరిజనులు మృత్యువాత పడుతుండగా, మరికొందరు మంచం బారిన పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చే పట్టినా జిల్లాలో ప్రజలకు మాత్రం సరైన వైద్య సేవలు అందడం లేదని ఆరోపణలు వినవసు ్తన్నాయి. వర్షాకాలం ఆసన్నమవడంతో పారిశుద్ధ్యం లోపించి కలుషిత నీరు తాగి మలేరియా, డయే ురియా, దోమల బెడద పెరిగి మెదడు వాపు, చికన్ గునియా వంటి జ్వరాలు సోకుతున్నాయి. వైద్యుల కొరతతో రోగులు సతమతమవుతున్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలు గుర్తించి ప్రజలకు వైద్య సే వలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.