అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ న్యాయ నిర్ణేతగా రిటైర్డ్ కల్నల్ శ్రీనివాసరావు

మునగాల, జూలై 13(జనంసాక్షి): ఆసియన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ -2022 పోటీలు జులై 15 నుండి 21 వరకు మాల్దీవ్స్ దేశంలో జరుగనున్నాయి. ఈ పోటీలకు ముగ్గురు న్యాయనిర్నెతల్లో ఒకరిగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవపురం గ్రామానికి చెందిన కల్నల్ (డాక్టర్) సుంకర శ్రీనివాసరావు (రిటైర్డ్)  భారతదేశం తరుపున ఎంపికయ్యారు. గతంలో 2010 కామన్వెల్ గేమ్స్, 2012 లండన్ ఒలింపిక్స్‌తో సహా అనేక అంతర్జాతీయ పోటీలకు మేనేజర్ మరియు న్యాయనిర్ణేత(జ్యూరీ)గా అతను 2017 నుండి భారతదేశం నుండి  ప్రాతినిధ్యo వహిస్తున్నారు.

*క్రీడాకారులకు శిక్షణ*

రిటైర్డ్ కల్నల్ శ్రీనివాస్ రావు సుమారుగా 500 మందికి పైగా క్రీడాకారులకు వివిధ క్రీడాలలో శిక్షణ ఇచ్చాడు. స్వాతహాగా వెయిట్ లిఫ్టింగ్ మరియు బాడీబిల్డింగ్‌లో దేశానికి పతకాన్ని గెలుచుకున్నాడు. శ్రీనివాస్ రావు  పంజాబ్లోని పాటియాలా నుండి క్రీడా శిక్షణలో ఎన్. ఐ.ఎస్, ఎం.ఎస్ మరియు పి.హెచ్.డి డిగ్రీని పూర్తి చేశాడు. ఇతని మార్గానిర్దేశంలో అనేక మంది క్రీడాకారులు సైన్యం మరియు అనేక ఇతర క్రీడా విభాగాలలో ఉద్యోగాలు పొందారు. సైన్యంలో కల్నల్ స్థాయిలో రిటైర్డ్ అయి కూడా వివిధ జిల్లాలో పర్యటిస్తూ నూతనంగా సైన్యంలో చేరబోయే యువతకు ఉత్సాహాన్ని, నైపుణ్యాన్ని అందిస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో  సైనికుడిగా తన కెరియర్‌ని ప్రారంభించాడు. అతని అంకితభావం కారణంగా  పైఅధికారులు అతనిని ఉన్నత చదువులు చదివేందుకు ప్రేరేపించడంతో అతను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి,ముఖ్యమైన సాంకేతిక విద్యను పూర్తి చేశాడు. సి.డి.ఎస్ పరీక్ష ప్రవేశం ద్వారా పదోన్నతి పొందారు, అధికారి కేటగిరీలోకి నియమించబడ్డారు. దేశం కోసం 32 సంవత్సరాల సేవలో కల్నల్ స్థాయికి పదోన్నతి పొందాడు. తన వాలెంటీర్ రిటైర్మెంట్ తర్వాత అతను “ది సైనికుల యూత్ ఫౌండేషన్” అనే ఎన్.జి.ఓని స్థాపించాడు. తెలంగాణ నిరుద్యోగ యువతకు సూర్యాపేట, మహబూబాబాద్, రామగుండం మరియు హైదరాబాద్ జిల్లాలలో శిక్షణా కేంద్రాలు యువత కోసం స్వయంగా స్థాపించి శిక్షణ ఇస్తున్నాడు.  వేలాది మంది నిరుద్యోగ యువకులు సాయుధ దళాలలో చేరేందుకు అతని వద్ద శిక్షణ పొందుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ తన రాష్టానికి పేరుతెస్తున్నారు.