అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుపై సీఎం సమీక్ష
హైదరాబాద్:మంత్రి గీతారెడ్డి అంతర్జాతీయ భాగస్వామ్యసదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని అకర్షించినట్లు మంత్రి గీతారెడ్డి తెలిపారు.ఈ ఏడాది జనవరిలో జరిగిన సదస్సుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటివరకు 243 ప్రతిపాదనలు వచ్చాయని వీటిలో 91 ప్రతిపాదనలు అమలు దశలో ఉన్నట్లు మంత్రి చెప్పారు.నాలుగింటిలో ఇప్పటికే ఉత్పత్తి కూడా ప్రారంభమైందన్నారు.ప్రతి మెగా ప్రాజెక్టుకు ఏర్పాటుకు ఒక ముఖ్య కార్యదర్శి స్ధాయి అధికారి ప్రత్యేక అధికారిగా నియమించినట్లు గీతారెడ్డి చెప్పారు.243 ప్రతిపాదనలు అమలుయ్యేందుకు సర్కారు కృషి చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.