అంతిమయాత్రలో ముందున్న బాబు

పాడెమోసిన చంద్రబాబు,జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): దివంగత టిడిపి నేత హరికృష్ణ అంతిమయాత్ర మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతలో స్వగృహం నుంచి మొదలైంది. హరికృష్ణ పార్థివ దేహాన్ని బయటకు తీసుకువచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన బావమరిది హరికృష్ణ పాడె పట్టుకున్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌ పాడె పట్టుకున్నారు. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, కుటుంబ సభ్యులు అశ్రునయనాలతో ముందు నడిచారు. ‘హరికృష్ణ అమర్‌ రహే’ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. హరికృష్ణ భౌతికకాయాన్ని అక్కడి నుంచి వైకుంఠ రథం (ప్రచార రథం) ఎక్కించారు. దాదాపు పది కిలోవిూటర్ల మేర అంతిమయాత్ర సాగి మహాప్రస్థానం చేరుకుంది. మెహిదీపట్నం, రేతీబౌలి, టోలిచౌకి, షేక్‌పేట్‌ నాలా విస్పర్‌ వ్యాలీ విూదుగా మహాప్రస్థానం చేరుకుంది. హరికృష్ణను కడసారి చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు భారీగా అభిమానులు తరలివచ్చారు. తొక్కిసలాట జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు హరికృష్ణ అంతిమయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రి, మెహిదీపట్నం, రేతీబౌలి, టోలిచౌకి, షేక్‌పేట్‌ నాలా, విస్పర్‌ వ్యాలీ విూదుగా మహాప్రస్థానం వద్దకు అంతిమయాత్ర కొనసాగింది. ఇదిలావుంటే నందమూరి హరికృష్ణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలాన్నికేటాయించింది. అంత్యక్రియలు ముగిశాక కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు స్మారక చిహ్నం నిర్మించే అవకాశం ఉంది.