అంతుచిక్కని జెసి రాజకీయ వ్యూహం

జిల్లాలో చర్చనీయాంశంగా మారిన వ్యవహారం

పార్లమెంట్‌ సమావేశాలకు డుమ్మాపై పెదవి విప్పని టిడిపి

అనంతపురం,జూలై19(జ‌నం సాక్షి): పార్లమెంటు సమావేశాలకు తాను హాజరుకాబోనని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన ప్రకటన జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ సమావేవాలనగానే ముందుండే జెసి నిర్వేదంలో ఉన్నట్‌ఉలగా సమాచారం. టిడిపిలో తనకు పెద్దగా గుర్తింపు లేదా అన్నది తెలియచేయడం లేదు. అటు కేంద్రం, రాష్ట్రంలో రాజకీయాలు బాగాలేవన్న జేసీ టీడీపీ విప్‌ జారీ చేసినంత మాత్రాన ఏవిూ కాదన్నారు. పార్లమెంటులో మాట్లాడేందుకు సమర్ధులైన నాయకులు చాలామందే ఉన్నారన్నారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రజల తరపున పార్లమెంటులో ఎంపీలు చక్కగా వినిపిస్తారని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఇద్దరు లేక ముగ్గురికో మాట్లాడే అవకాశం వస్తుందన్నారు. అనుభవం ఉన్నవారు, ఇంగ్లీష్‌పై ప్రావీణ్యం ఉన్నవారు మాట్లాడతారని చెప్పారు.ప్రస్తుత సమావేశాలు జరిగినన్ని రోజులు తాను పార్లమెంటుకు వెళ్లనని స్పష్టం చేశారు. ఈ విషయం సీఎం చంద్రబాబుకు తెలుసని అనుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు. వైసీపీలో చేరతానన్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. తనకు, ఎంపీలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఎవరివిూదా తనకు కోపం లేదని తెలిపారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని, తుది వరకు ఈ రాష్ట్రానికి సేవ చేస్తానని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఆయన రాజకీయ వ్యూహం ఏమిటన్నది మాత్రం అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై సమరానికి సన్నద్ధమని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి దేశీయంగా చర్చకు తెరలేపారు. ఇంతటి కీలక సమయంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆకస్మికంగా సమావేశాలకు హాజరు కాకుండా డుమ్మా కొట్టడం తీవ్ర సంచలనంగా మారింది. రాజకీయ పరిస్థితులు బాగోక పోవడంతోనే తాను సమావేశాలకు హాజరు కాలేదని ఆయన చెబుతున్నప్పటికీ, దీని వెనుక కీలక పరిణామాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని ఆయన పార్లమెంట్‌ స్థానం పరిధిలో జరుగుతున్న కొన్ని అంశాలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.గతంలో కొన్ని సమస్యలపై రాజీనామా అస్త్రాలు ప్రయోగించిన ఆయన, ఈసారి అటువంటిదేవిూ లేకుండా, పార్లమెంట్‌ సమావేశాలకే డుమ్మా కొట్టారు.ఇటువంటి కీలక పరిణామాలు జరుగుతున్న సమయంలో, ఆ పార్టీలో ముఖ్యమైన నేతగా పేరున్న అనంతపురం పార్లమెంట్‌ సభ్యులు జేసీ దివాకర్‌రెడ్డి ఈ సమావేశాలకు గైర్హాజరయ్యారు. బుధవారం ఆయన హైదరాబాద్‌ నుంచి జిల్లాకు చేరుకొని ఇక్కడేతిష్టవేశారు. అలాగే ఈసారి పార్లమెంట్‌ సమావేశాలు జరిగినన్ని రోజులు తాను హాజరయ్యేదే లేదని విూడియా ముందు ఖరాకండిగా చెప్పారు. దీంతో ఈ అంశం అంతటా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందులో ఏదో ఆంతర్యం ఉందనే చర్చ మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరితో విభేదాల కారణంగా ఆయతన తలపెట్టిన పనులు ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా నగరంలోని రహదారుల విస్తరణ ఇందులో కీలకమైంది. ఒకానొక దశలో విస్తరణకు అంతా రంగం సిద్ధమైన తరుణంలో, చివరి దశలో అవి ఆగిపోయాయి. దీనిపై జేసీ చాలా కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు జేసీ అభయం ఇచ్చి, వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని తెదేపాలోకి తీసుకొచ్చారు. ఆయన త్వరలోనే మళ్లీ వైకాపాకు వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత జగన్‌ ఇందుకు ఆమోదం తెలిపారనీ, ఈ వారంలోనే జగన్‌ సమక్షంలో మళ్లీ గుర్నాథరెడ్డి వైకాపాలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. గుర్నాథరెడ్డిని తాను తెదేపాలోకి తీసుకొచ్చినా, ఏవిూ చేయలేకపోయానని జేసీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయననీ, తన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి ఎంపీగా బరిలో నిలుస్తారని జేసీ కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్నారు. మొన్నటి వరకు ఆయనతో సన్నిహితంగా ఉన్న పలువురు ముఖ్యనేతలు సైతం, ఇటీవల కొంత దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇలా అనేక పరిణామాలు జేసీ అలక వెనుక కారణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఇప్పుడు జి/-లా రాజకీయాల్లో చర్చగా మారాయి.

 

తాజావార్తలు