అందరి బాంధవుడు సీఎం కేసీఆర్

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే
-మార్కెట్ కమిటీ చైర్మన్ బజ్జూరి ఉమా పిచ్చి రెడ్డి

కురివి అక్టోబర్-1
(జనం సాక్షి న్యూస్)

కురవి మండల కేంద్రంలోని గుడి సెంటర్లో సంబరాలు చేసుకున్న టిఆర్ఎస్ శ్రేణులు.గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచుతూ కెసిఆర్ సంచలన నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తు కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం,
బాణసంచా కాల్చి,
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన టిఆర్ఎస్ కురవి మండల నాయకులు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ మార్కెట్ చైర్మన్ బజ్జురి ఉమా పిచ్చిరెడ్డి, కురవి మండల అధ్యక్షుడు తోట లాలయ్య,టిఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోతు రవినాయక్ లు మాట్లాడారు….. గిరిజన జీవితాల్లో ఒక చారిత్రక ఘట్టం,
చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు గిరిజన జీవితాల్లో వెలుగులు నింపబడిన రోజు సీఎం కేసీఆర్ షెడ్యూల్ తెగలకు (ఎస్టీ) రిజర్వేషన్ పెంచుతూ వరాల జల్లు కురింపించారు.ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో,విద్య సంస్థల్లో రిజర్వేషన్ ను 6 నుండి 10 శాతానికి పెంచుతూ జి ఓ 33 ను జారీ చేసినందున వారికి కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో 3146 తండాలను,కోయగూడాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. గిరిజనులకు గిరిజనబంధు ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం అమోఘం అని కొనియాడారు.గిరిజన జాతి ఎల్లప్పుడూ టిఆర్ఎస్ పార్టీకి,కేసీఆర్ కి ఋణపడి ఉంటుంది అని అన్నారు. నాడు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత అంబేద్కర్ గారిది అయితే నేడు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ దే అని అన్నారు.సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అంటూ కొనియాడుతూ అభినవ సేవాలాల్ గా కేసీఆర్ ను అభివర్ణించారు. గిరిజనులకు ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ చేశారని అన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ కి,డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి,ఆలయ ఛైర్మన్ బాదావత్ రామునాయక్,వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్య, మాజీ ఆలయ చైర్మన్ బాదావత్ రాజునాయక్, టిఆర్ఎస్ మండల నాయకులు బాణోత్ తుకారాంనాయక్, తేజావత్ భోజ్యనాయక్, తోట రమేష్,కొనతం విజయ్, యూత్ మండల అధ్యక్షుడు బాణోత్ రమేష్, ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు బాణోత్ రాము,సోషల్ మీడియా మండల అధ్యక్షుడు మాలోత్ సూర్యనాయక్,సర్పంచ్ లు,ఎంపీటీసీలు,పార్టీ అధ్యక్షులు,కిరణ్,యుగేందర్,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.