అంబరాన్నంటిన రియో ముగింపు వేడుకలు
67 స్థానంలో భారత్
31వ మోడ్రన్ ఒలింపిక్ గేమ్స్ ముగిశాయి. 5న ప్రారంభమైన ఒలింపిక్స్ ఇవాళ్టితో ముగిశాయి. 18 రోజులుగా క్రీడాభిమానులను విశేషంగా అలరించిన ఒలింపిక్స్ క్లోజింగ్ సెర్మనీ రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో గ్రాండ్ గా జరిగింది. ఈ సారి 46 స్వర్ణాలు సహా 121 పతకాలు కొల్లగొట్టి అమెరికా ఫస్ట్ ప్లేస్ లో నిలవగా లండన్ ఒలింపిక్స్ లో రెండోస్థానంలో ఉన్న చైనా మూడోస్థానానికి పడిపోయింది. రియోలో చైనా 26 స్వర్ణాల సహా మొత్తం 70 పతకాలు సాధించింది. రెండో స్థానంలో ఉన్న గ్రేట్ బ్రిటన్ 27 స్వర్ణాలు సహా 67పతకాలు సాధించింది. 19 స్వర్ణాలతో రష్యా నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఒక రజతం, ఒక కాంస్య పతకంతో సరిపెట్టుకున్న భారత్ పతకాల పట్టికలో 67 స్థానంతో ఒలింపిక్స్ ముగించింది.