అకాల వర్షంతో నగరం అతలాకుతలం
` హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
` పలు ప్రాంతాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
` సహాయకచర్యల్లో తీవ్ర జాప్యంతో ప్రజలు ఇబ్బందులు
` పరిస్థితిపై అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష
` కొన్నిచోట్ల వడగళ్ల వర్షంతో దెబ్బతిన్న వాహనాలు
` పలుచోట్ల కూలిన చెట్లు..ట్రాఫిక్‌కు అంతరాయం
` నగరంపై క్యుములోనింబస్ మేఘాల ఆవరణ
హైదరాబాద్(జనంసాక్షి): అకాల వర్షంతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సహాయకచర్యల్లో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. కూలిన చెట్లను వెంటనే తొలగించాలని డీఆర్‌ఎఫ్ సిబ్బందిని ఆదేశించారు.ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరోసారి భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రోడ్లపై నీరు నిలిస్తే వెంటనే తొలగించాలని పొన్నం సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. బండ్లగూడలో 8 సెం.మీ వర్షపాతం నమోదైంది. బహదూర్‌పురలో 7.8 సెం.మీ , చార్మినార్‌లో 7.6 సెం.మీ, నాంపల్లిలో 6.9 సెం.మీ, అంబర్‌పేటలో 5 సెం.మీ, ఖైరతాబాద్‌లో 4.4 సెం.మీ, కుత్బుల్లాపూర్‌లో 4.3 సెం.మీ ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరువాన కురిసింది. ఎస్‌ఆర్ నగర్, బోరబండ, జూబ్లీహిల్స్, కోఠి, నాంపల్లి, హిమాయత్‌నగర్, కార్వాన్, కుత్బుల్లాపూర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడిరది. వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిరది. చాలా చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ స్తంభించింది
అధికారులతో సవిూక్షించిన మంత్రి పొన్నం
అకాల వర్షంతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సహాయకచర్యల్లో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సవిూక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. కూలిన చెట్లను వెంటనే తొలగించాలని డీఆర్‌ఎఫ్ సిబ్బందిని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరోసారి భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రోడ్లపై నీరు నిలిస్తే వెంటనే తొలగించాలని పొన్నం సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. బండ్లగూడలో 8 సెం.విూ వర్షపాతం నమోదైంది. బహదూర్‌పురలో 7.8 సెం.విూ , చార్మినార్‌లో 7.6 సెం.విూ, నాంపల్లిలో 6.9 సెం.విూ, అంబర్‌పేటలో 5 సెం.విూ, ఖైరతాబాద్‌లో 4.4 సెం.విూ, కుత్బుల్లాపూర్‌లో 4.3 సెం.విూ ల వర్షపాతం నమోదైనట్లు- వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.