అకాల వర్షాలతో రైతాంగానికి తీవ్రనష్టం
వారిని ప్రభుత్వం తోణం ఆదుకోవాలి: నక్కా
గుంటూరు,డిసెంబర్8 జనం సాక్షి : అకాల వర్షాలకు రైతాంగ తీవ్రంగా నష్టపోయిందని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పేర్కొన్నారు. డెల్టా ప్రాంతంలో 50 శాతం వరి పంటకు నష్టం వాటిల్లిందన్నారు. రైతులకు వరుసగా దెబ్బ విూద దెబ్బలు తగులుతున్నాయన్నారు. బాధ్యతగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందన్నారు. పంట నష్టం అంచనాలు వేయడంలోనే ప్రభుత్వం నిర్లక్ష్యంగా మారిందన్నారు. నిజంగా పంట నష్ట పోయిన రైతులను గుర్తించడం లేదని ఆనందబాబు వాపోయారు. రాజకీయ ఒత్తిడితో సంబంధం లేని వ్యక్తులను రైతులుగా నమోదు చేస్తున్నారన్నారు. వైసీపీ వారినే బాధితులుగా చేర్చాలని ఎమ్మెల్యేలు పెట్టే ఒత్తిడితో అధికారులు సతమతమవుతున్నారు. రైతుల ధరల స్దిరీకరణ నిధి ఏమైందని ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలు ఎవరి కోసమో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. నిజమైన రైతులను న్యాయం జరగకపోతే పోరాటం చేస్తామని… అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.