అక్బరుద్దీన్‌పై మరికొన్ని కేసులు
ఆదిలాబాద్: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను కస్టడీకి అప్పగించాలని న్యాయమూర్తిని కోరినట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలియజేశారు. గత నెల 22న నిర్మల్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి అక్బరుద్దీన్‌పై అదనంగా 120 (బీ), 124(ఏ), 295 (ఏ), 505, 188 ఐసీసీ సెక్షన్ల కింద మరి కొన్ని కేసులను నమోదు చేసినట్లు చెప్పారు.