అగ్రిగోల్డ్ డైరెక్టర్ పేరిట 200 ఎకరాలు
అటాచ్ చేయాల్సిందిగా పోలీస్ శాఖ సూచన
అమరావతి,ఆగస్ట్17(జనం సాక్షి ): ఆంధప్రదేశ్ అగ్రిగోల్డ్ కేసులో మరో కీలక అడుగు పడింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను గుర్తించే పనిలో పడ్డారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్ పేరిట ఆస్తులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్టణం జిల్లాల్లో 200 ఎకరాల భూమి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించగా ఈ భూమిని అటాచ్ చేయాలని ప్రభుత్వానికి పోలీస్‌శాఖ ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం గుర్తించిన భూమి విలువ దాదాపు రూ. 8.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అలాగే ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయోఎ గుర్తించే పనిలో పడ్డారు.