అటవీ అధికారులపై స్మగ్లర్ల దాడి

కరీంనగర్‌: మహాముత్తారం అటవీప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 2 లక్షల విలువైన కలపను పట్టుకున్న అటవీ అధికారులపై స్మగ్లర్లు దాడికి దిగారు. అనంతరం స్మగ్లర్లు కలపతో అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడ్డ నలుగురు అధికారులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.