అట్టహాసంగా ఖేల్‌ కూద్‌ పోటీలు

అట్టహాసంగా ఖేల్‌  కూద్‌ పోటీలు

సిద్దిపేట మండలం తడ్కపల్లి ఆవాస విద్యాలయంలో సంభాగ్‌స్థాయి(మెదక్‌,నిజామాబాద్‌ జిల్లాలు ) ఖేల్‌ కూద్‌ పోటీలు

ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి మెదక్‌ నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన పరస్వతి విద్యాలయాలకు చెంది

న సుమారు 200 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు ఈ పోటీలను సిద్థి పేట ఏఎంసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ ప్రారంభించారు ఈ సందర్భంగా  ఆయన మాట్లా డుతూ విద్యార్థులకు క్రమశిక్షణను అలవర్చుతూ వారి భవితకు సరస్వతి విద్యాలయాలు బాటలు వేస్తున్నాయని అన్నారు సరస్వతి విద్యాలయాలు క్రమశిక్షణ మారుపేరుగా  నిలుస్తూనే ఆగ్లమాధ్య పాఠశాలలతో ప్రభావితం అవుతున్న తెలుగుకు జీవం పోస్తు  న్నాయన్నారు సంస్కృతి సంప్రదాయలను నేర్పుతూ దేశ ఔన్నత్యాన్ని నిలబెడుతున్నాయ న్నారు గెలిచిన వారు  మరింతగా కృషిచేయాలని

ఓడినవారు గెలుపుకు బాటలు వేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం

పోటీలకు ప్రారంభ సూచికగా శాంతి కపోతరం ఎగురవేసి క్రీడాజ్యోతిని వెలిగించారు విజేతలైన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో  పాఠశాల ప్రధానాదార్యులు శ్రీనివాస్‌ సరస్వతి విద్యాపీఠం మెదక్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఈ శ్వరయ్య,రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి చంద్రశేఖరం దక్షిణామూర్తి ప్రభాకర్‌ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.