అడ్వాన్స్‌ను తిరిగిరాబడుతున్న సింగరేణి యాజమాన్యం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 29 :సకలజనుల సమ్మె కాలంలో సింగరేణి యాజమాన్యం కార్మికులకు అడ్వాన్స్‌గా చెల్లించిన రూ.25వేల అడ్వాన్స్‌ను తిరిగి రాబట్టేందుకు నిర్ణయించడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అన్ని కార్మిక సంఘాలు అడ్వాన్స్‌లు మాఫీ చేయిస్తామని హామీ ఇచ్చారని, అయినప్పటికీ యాజమాన్యం నెలనెలా వేతనాలలో కోత విధించేందుకు నిర్ణయించడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా కార్మికుల వేతనాల నుంచి 2500 రూపాయల కోత విధిస్తూ ఏడు వాయిదాలలో అడ్వాన్స్‌ను తిరిగి రాబట్టుకునేందుకు యాజమాన్యం నిర్ణయించింది. 9వ వేతన ఒప్పందం తాలూకు అడ్వాన్స్‌ చెల్లింపు సమయంలో కార్మికుల నుంచి 7,500 కోత విధించింది. మిగతా 17,500 రూపాయలను వాయిదాల రూపంలో తిరిగి రాబట్టుకునేందుకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.