అణుయుద్ధంపై హిజ్బుల్‌ చీఫ్‌ హెచ్చరికలు

ఇస్లామాబాద్‌: భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య అణు యుద్ధం జరిగే అవకాశముందని పాకిస్థాన్‌లోని హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌ హెచ్చరించాడు. కరాచీలో సలాహుద్దీన్‌ విలేకరులతో మాట్లాడుతూ కశ్మీర్‌ అంశంపై ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశముందని అన్నాడు. కశ్మీర్‌ అంశంలో గతంలోనే పలుమార్లు ఇరు దేశాలు పోరాడాయి. మరోసారి కూడా పోరాటం జరిగే అవకాశముందని సలాహుద్దీన్‌ పేర్కొన్నాడు. ఎవరు మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కశ్మీర్‌ ప్రజలు పోరాడుతూనే ఉంటారని అన్నాడు. కశ్మీర్‌లో పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక అంతర్జాతీయ నిబంధనలు వారిని అడ్డుకోలేవని అన్నారు. సైనిక బలగాలను అడ్డుకోవడం మినహా వారికి మరో అవకాశం కూడా లేదని సలాహుద్దీన్‌ వ్యాఖ్యానించాడు.