అతివేగాన్ని నిరోధించండి అధికారులను కోరిన స్థానికులు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 : జిల్లాలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఏడుగురు మృతి చెందగా 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాలను నిరోదించడంలో పోలీసులు కాని, ఆర్టీఏ అధికారులు కాని సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. లారీలు అతివేగంగా నడపడం, కెపాసిటీకి మంచి ఆటోలలో ప్రయాణించడం వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్న అధికారులు మాత్రం కఠినంగా వ్యవహరించకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే నాయకులు, ప్రజలు స్పందించడం ఆ తర్వాత మరిచిపోవడంతో ఈ ప్రమాదాలకు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. జిల్లాలో విపరీతంగా ఆటోలు పెరగడం, ప్రజలు అందులోనే  ప్రయాణించడం, మోతాదుకు మంచి ప్రయాణికులను తీసుకుపోవడంతో రవాణానాలు అదుపుతప్పతున్నాయి. అదేవిధంగా కాలం చెల్లిన వాహనాలను నడపడం కూడా ఈ ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. అర్హత లేనివారు కూడా, లైసెన్స్‌ లేని వారు చిన్న, భారీ వాహనాలను నడపడం, అతివేగం కూడా ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. జాతీయ రహదారులు, నాలుగు లైన్ల రోడ్లను నిర్మించడం వల్ల వేగతంతో నిమిత్తం లేకుండా అతివేగంగా వాహనాలు నడుపుతున్నారు. ఆర్టీఏ, పోలీస్‌ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించకపోవడం వల్ల ఇష్టారాజ్యగంగా వాహనాలు నడుస్తుండడం వల్ల ఈ ప్రమాదాలకు మూల కారణం కాలం చెల్లిన వాహనాలు నడిపిస్తున్న, లంచాలకు మరిగిన అధికారులు పట్టించుకోకపోవడం వల్ల అణునిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు వారోత్సవాలు అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్న అధికారులు క్షేత్రస్థాయిలలో తనిఖీలు చేపట్టకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పిటికైన అధికారులు  విస్తృతంగా తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ప్రమాదాలను అరికట్టలేరన్నది సత్యం.