అత్తపై కత్తితో అల్లుడి దాడి

ప్రకాశం: ముండ్లమూరులో కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అత్తను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు.