అత్యవసరంగా శంషాబాద్‌లో దిగిన ఖతార్‌ విమానం

 హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. ఖతార్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం దోహా నుండి నాగపూర్ వెళ్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాతావరణం అనుకూలించక పోవడంతో విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో పైలెట్ ల్యాండ్ చేశారు. గతంలో కూడా పలు విమానాలను ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.నాగ్‌పూర్‌లో వాతావరణ పరిస్థితులు అనుకలించకపోవడంతో విమానాన్ని హైదరాబాద్‌కు  దారిమళ్లించారు. దీంతో విమానాన్ని శంషాబాద్‌లో దించినట్లు అధికారులు తెలిపారు.విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారని, అంతా క్షేమంగానే ఉన్నారని చెప్పారు. వారికి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా, తమను గమ్యస్థానానికి కాకుండా మధ్యలోనే దించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముందుగానే చూసుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని మండిపడ్డారు.