అత్యాచారం కేసులో 150ఏళ్ల జైలుశిక్ష
అమెరికా, రష్యా పౌరసత్వాలు కలిగిన 58ఏళ్ల యూసెఫ్ అబ్రమోవ్ అనే వ్యక్తికి పలు పర్యాయాలు రష్యాలో పర్యటించాడు. ఈ నేపథ్యంలో 2009 జూన్‌లో రష్యాలో 12ఏళ్ల బాలికపై యూసెఫ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తానని బాలికను బెదిరించాడు. అలా యూసెఫ్ ఎప్పుడు రష్యా వెళ్లినా.. అక్కడి బాలికలతో క్రూరంగా ప్రవర్తించేవాడు. అంతేగాక, అతడి ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలికలపైనా తన మిత్రులతో కలిసి సామూహిక అత్యాచారాలకు పాల్పడేవాడు.
దీంతో యూసెఫ్‌ను పట్టుకునేందుకు అమెరికా, రష్యా అధికారులు సంయుక్తంగా నిఘా పెట్టి 2014 ఏప్రిల్‌లో అతడిని అరెస్టు చేశారు. దీనిపై యూఎస్ న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది. యూసెఫ్‌కు 45ఏళ్ల జైలుశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది. అయితే అతడి నేరాలకు 150ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.