అదితి తెస్తుందా మరో పతకం!
రియో డి జనీరో: రియోలో యువ గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ నేడు కీలక మ్యాచ్ ఆడనుంది. మూడురోజులు జరిగిన ఆటలో ఆమె 79వ స్థానం నుంచి 23వ స్థానానికి ఎగబాకింది. మొదటి మూడు రోజుల్లో అదితి మొత్తం 215పాయింట్లు సాధించింది. దీంతో భారత్‌కు మరో పతకంపై ఆశలు సజీవంగా ఉన్నాయి. రియోలో పాల్గొంటున్న అతి పిన్నవయసు గోల్ఫ్ క్రీడాకారుల్లో అదితి ఒకరు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని బట్టి దక్షిణ కొరియా, న్యూజిలాండ్, అమెరికా, చైనా క్రీడాకారులు తొలిస్థానాల్లో ఉన్నారు.
గోల్ఫ్‌లో అర్హత సాధించిన ఏకైక భారతీయ అథ్లెట్‌గా అదితి అశోక్ రికార్డు సృష్టించారు. 18ఏళ్ల ఈ యువ క్రీడాకారిణి అతి చిన్న వయస్సులోనే లల్లా ఐచా టూర్ స్కూల్, 2016 సీజన్‌కు లేడీస్ యూరోపియన్ టూర్‌కార్డును సాధించారు. దీంతో ఆమె ఇంటర్నేషనల్ టూర్ కోసం క్యూస్కూల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు.