అద్వాన స్థితిలో బాలు తండా రోడ్డు
*గుంతల మయంగా గ్రామ రహదారి,
* మాటలకే పరిమితమైన ప్రజాప్రతినిధులు,
ఖానాపురం ఆగస్టు 7జనం సాక్షి
మండలంలోని ధర్మ రావు పేట పంచాయతీ పరిధిలోని బాలు తండా గ్రామానికి వెళ్లే రహదారి గుంతల మయంగా మారటంతో ప్రజలు వాహనాదారులు ఆ రోడ్డు పై ప్రయాణించాలంటే భయాందోళనలకు గురి అవుతున్నారు.
ధర్మారావుపేట బాలుతండా నుండి కొత్తూరు గ్రామానికి నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. ఈ రోడ్డు మాత్రం పూర్తిగా గుంతలు పడి, ప్రయాణికులు, వాహనదారులు ప్రయాణించే పరిస్థితి లేదని రాత్రి సమయాల్లో పనులు ముగించుకొని ఇంటికి వెళ్లాలంటే ద్విచక్ర వాహనదారు లు ప్రయాణికులు
అనేక ఇబ్బందులు పడుతున్నారని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు వెంబడి రైతులు పోయే కూలీలు నానా అవస్థలు పడే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధులు గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు ప్రతిసారీ రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పుడు వరకే సరిపోతుంది మాటలే కానీ చేతలు లేవు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా
ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి బాల్ తండ రోడ్డును ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.




