` మాటతప్పం.. మడమ తిప్పం
` బూటకపు మాటలతో బీఆర్‌ఎస్ మోసం
` తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కారు
` అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్
` నిరుద్యోగులు కష్టపడుతుంటే పేపర్ల లీక్
`ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు
` జనగామ,మహబూబాబాబాద్ సభల్లో ప్రియాంక
జనగామ,మహబూబాబాబాద్(జనంసాక్షి): ఎన్నికల టైంలో బీఆర్‌ఎస్ చెప్పే బూటకపు మాటలు నమ్మొద్దని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తెలంగాణ యువతకు పిలుపునిచ్చారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభకు ప్రియాంక గాంధీ హాజరయ్యారు . పదేండ్లుగా తెలంగాణలో బీఆర్ ఎస్ అధికారంలో ఉంది.. ఏ లక్ష్యం కోసమైతే రాష్టాన్న్రి తెచ్చుకున్నామో అవి ఒక్కటైనా నెరవేరాయా అని ప్రశ్నించారు. ఈ పదేళ్లలో ఎంత మంది యువకులు ఉపాధి, ఉద్యోగాలు కల్పించారో బీఆర్ ఎస్ ప్రభుత్వం చెప్పాలన్నారు. ఉద్యోగాలకోసం యువత కష్టపడుతుంటే.. బీఆర్ ఎస్ ప్రభుత్వం మాత్రం లీకులు చేస్తోందని ఆరోపించారు ప్రియాంక గాంధీ. పేపర్ లీకులతో యువతి ఆత్మహత్య చేసుకుంటే తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. యువకులే దేశ నిర్మాతలు.. అలాంటి యువత అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని.. అధికారంలోకి రాగనే యువత, నిరుద్యోగులకోసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ప్రియాంక గాంధీ హావిూ ఇచ్చారు. పదేళ్లో రైతుల నుంచి బీఆర్ ఎస్ ప్రభుత్వం భూములను లాక్కొందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. కాంగ్రెస్ పార్టీని గెలించుకుంటే ఏ లక్ష్యంతో అయితే రాష్టాన్న్రి తెచ్చుకున్నామో.. అవి నేరవేరుతాయని ప్రియాంక గాంధీ చెప్పారు. అన్ని వర్గాలను మోసం చేసిన కేసీఆర్ సర్కార్‌కు ఎక్స్ పైరీ డేట్ వచ్చేసిందని.. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తమ ఆకాంక్షలను నెరవేరుస్తుందని ప్రజలు బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇస్తే.. వాటిని ఈ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. బీఆర్‌ఎస్, బీజేపీలు రెండు కుమ్మక్కు అయ్యాయని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాలు పేదల కోసం చేసిందేమి లేదని స్పష్టం చేశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అహంకారంతో విర్రవీగుతున్నాయని, సామాన్యులు, రైతుల సంక్షేమం గురించి ఈ ప్రభుత్వాలు మరిచిపోయాయని మండిపడ్డారు. తప్పు చేసిన పిల్లలకు తల్లిదండ్రులు బుద్ధి చెప్పినట్లుగానే ప్రజల ఆకాంక్షలను మర్చిపోయిన బీఆర్‌ఎస్ సర్కార్‌కు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం త్యాగాలు, బలిదానాలతో ఏర్పడిరదని త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ పురోగతి సాధించాలంటే రాష్ట్రంలో మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్ కాంగ్రెస్ విజయ భేరి సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టులు అవినీతి మయంగా మారిపోయాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య జరుగుతున్నాయని తెలిపారు. కష్టపడి చదివితే పేపర్ లీకులు చేస్తున్నారని విమర్శించారు. ఢల్లీిలో బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తే, తెలంగాణ బీఆర్‌ఎస్‌కు బీజేపీ మద్దతు ఇస్తోందని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు శంషాబాద్ చేరుకున్న ప్రియాంకకు కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆమె రోడ్డు మార్గంలో ప్రచారానికి వచ్చారు.
నిరుద్యోగులు కష్టపడుతుంటే పేపర్ల లీక్
మహబూబాబాబాద్:నిరుద్యోగులు కష్టపడి ఉద్యోగాల కోసం పరీక్ష రాస్తే పేపర్ లీకులు చేస్తున్నారని ప్రియాంక గాంధీ విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, నిరుద్యోగుల ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం దుష్పచ్రారం చేస్తోందని ప్రియాంక గాంధీ మండిపడ్డారు.తొర్రూరు కాంగ్రెస్ విజయభేరీ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. యువత ఆలోచనలకు తగ్గట్లుగా ప్రభుత్వాలు ఉండాలని, 10 ఏళ్లలో యువతకు ఉద్యోగాలు దొరకలేదని అన్నారు. ’వీరులను కన్న భూమి తెలంగాణ. యశస్విని రెడ్డి కోడలా…బిడ్డా అని రaాన్సీ రెడ్డిని అడిగాను. నా కూతురు లాంటి కోడలు అని రaాన్సీ రెడ్డి చెప్పారు. ఇలాంటి మంచి కుటుంబం విూకోసం రావడం సంతోషం. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఎన్నికల సమయం, అందరం ఆలోచించాల్సిన సమయం. నాయకులు ఎలాంటి వారో ప్రజలు ఆలోచించాలి. 10 ఏళ్ల క్రితం రాష్ట్రం ఇచ్చాం. ఇక్కడ పరిపాలన ఎలా ఉందో విూకు తెలుసు. విూ త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ గురించి అందరం ఆలోచించాలి. ఈ రాష్ట్ర అభివృద్ధికి విూ ఓటు ఎంతో కీలకం. యువత ఆలోచనలకు తగ్గట్లుగా ప్రభుత్వాలు ఉండాలి. పదేళ్లలో యువతకు ఉద్యోగాలు దొరకలేదు. కష్టపడి ఉద్యోగాల కోసం పరీక్ష రాస్తే పేపర్ లీకులు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలపై దుష్పచ్రారం చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణ ప్రజలను ఈ ప్రభుత్వం చీకటిలోకి తీసుకెళ్తుంది. యువత దేశానికి పట్టుకొమ్మలు.’ అని ప్రియాంక గాంధీ చెప్పారు. ’కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్టాల్లో యువతకు రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. యువత కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి కచ్చితమైన ఉద్యోగాల కల్పన అందిస్తాం. ప్రతీ
మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు ఇస్తామని మేము హావిూ ఇస్తున్నాం. ఇక్కడి మహిళలు ఎంతో ఇబ్బందికర జీవితం గడుపుతున్నారు. మహిళలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల రక్షణ, గౌరవం కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు. రైతు సోదరులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అన్ని వర్గాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ రాగానే అందరికీ సంక్షేమం అందిస్తాం. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలు కుంభకోణాల కు కేరాఫ్ గా మారాయి. బీఆరెస్, బీజేపీ రెండు ఒక్కటే. అందుకే మార్పు కావాలి… కాంగ్రెస్ రావాలని ప్రియాంక గాంధీ అన్నారు