అధికారుల ఉదాసీనతతో..  ఆదాయానికి గండి

– రూ.124కోట్లకు కేవలం 53కోట్లే పన్నులు వసూళ్లయ్యాయి
– అధికారుల తీరుపై విజయవాడ మేయర్‌ ఆగ్రహం
విజయవాడ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : విజయవాడ నగర పాలక సంస్థ అధికారుల తీరుపై మేయర్‌ శ్రీధర్‌ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నగరపాలక సంస్థకు రావాల్సిన పన్నుల వసూళ్లలో అధికారులు ఉదాసీనంగా ఉండటంతో సగం ఆదాయం కూడా రావడం లేదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 124 కోట్ల రూపాయల ఇంటి పన్ను వసూలు కావాల్సి ఉండగా.. కేవలం 53 కోట్లు మాత్రమే వసూలు చేయటాన్ని ఆయన తప్పుబట్టారు. బిల్‌ కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లే నగరాపాలక సంస్థకు రావాల్సిన ఆదాయం రావడం లేదన్నారు. నీటి పన్ను, డ్రైనేజీ పన్ను విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని విమర్శించారు. అధికారులు స్పందించి పన్నులు సక్రమంగా వసూలు చేస్తే… నగరంలో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. పారిశుధ్యం విషయంలో తడి-పొడి చెత్త సేకరణకు ప్రజలు సహకరించాలని మేయర్‌ కోరాలాగే ¬టళ్ల యజమానులు తమ వద్ద పోగయ్యే చెత్తను సొంతగా డంపింగ్‌ యార్డుకు తీసుకెళ్లాలని కోరారు.రు.

తాజావార్తలు