*అధిక సాంద్రతతో పత్తి సాగు లాభదాయకం.

 చిట్యాల సెప్టెంబర్14 (జనంసాక్షి) అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు లాభదాయకమని ఏడిఏ నర్సింగం అన్నారు. బుధవారం మండలంలోని జూకల్ గ్రామంలో  ఏడిఏ  నర్సింగం, మండల వ్యవసాయ శాఖ అధికారి నాలిక రఘుపతి, ఏఈఓ రూపిక గ్రామంలోని రవి, రవీందర్ ల పంట క్షేత్రాలను సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం వలన అధిక దిగుబడి అక్టోబర్, నవంబర్ నెలలో పంట చేతికి వస్తుందన్నారు. పత్తి యొక్క పెరుగుదలను నియంత్రించడానికి మెపిక్వాట్ క్లోరైడ్ 1 లీటర్ నీటికి, 1 ఎంఎల్ మందులను పిచికారి చేయాలని, రైతులకు పలు సలహాలు, సూచనలు చేశారు.