అధైర్యపడొద్దు…. అప్రమత్తంగా ఉండండి.

– బూర్గంపహాడ్ తహశీల్దార్ భగవాన్ రెడ్డి.

బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో గోదావరి వరదల వల్ల ఎవరూ అధైర్య పడవద్దని, అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ భగవాన్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో          లోతట్టు ప్రాంతమైన ఎస్సీ కాలనీను తహశీల్దార్  పరిశీలించారు. ఈ క్రమంలో గోదావరి వరద వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు తహశీల్దార్ కు మొర పెట్టుకున్నారు. గోదావరి వరదల వల్ల వ్యవసాయ కూలి పనులు లేక తాము అనేక ఇబ్బందు లు పడుతున్నామని, సురక్షితమైన ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు ఇస్తే తాము అక్కడకు వెళ్తామని వారు తహశీల్దార్ కు విన్న వించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి వరద మరో రెండు, మూడు అడుగులు వచ్చి మరలా తగ్గుముఖం పడుతుందని, ఎవరు అధైర్యపడవద్దని ఆయన అన్నారు. ముంపు వాసులకు ఇళ్ల స్థలాల విషయంలో జిల్లా ఉన్నతాధికారులకు ఈ సమస్యను వివరిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్ర మంలో ఎస్సీ కాలనీ వాసులు తోకల రవి ప్రసాద్, తోకల నాగరాజు, నందిపాటి పండు, బండ్ల తులశమ్మ, తోకల సుహా సిని,తోకల పున్నమ్మ తదితరులు పాల్గొన్నారు.