అనంతపురంలో ఘోర రైలు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా మడకశిర రైల్వే గేట్ దగ్గర ఘోర రైలు ప్రమాదం జరిగింది. గ్రానైట్ లోడుతో వెళ్తున్న ఓ లారీకి బ్రేకులు ఫెయిల్ కావడంతో నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. హెచ్-1 బోగీపై పడ్డ గ్రానైట్ రాయిపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మూడు బోగీలు పట్టాలు తప్పాయి. మరో రెండు బోగీలు పట్టాలపై ఒరిగిపోయాయి. రైలు బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వారిలో కర్ణాటక ఎమ్మెల్యే వెంకటేష్‌నాయక్, హెచ్-1 బోగీ ఏసీ టెక్నీషియన్, లారీ డ్రైవర్, క్లీనర్ మరో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే, జిల్లా ఉన్నతాధికారులతోపాటు అనంతపురం కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. మిగిలిన ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వారి ప్రాంతాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. రైలు ప్రమాదం జరగడంతో బెంగళూరు-గుంతకల్లు మధ్యలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలింగింది. పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు రైల్వే అధికారులు హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసింది. నంబర్లు – 08555220248, 08559222555, 08554236444, 02446223540, 08482226329, 08416252013, 09731666751.