అనుకున్న లక్ష్యాను చేరుకోని వృద్దిరేటు

నిర్మాల సీతారామన్‌ వ్యాఖ్యలపై రఘురామన్‌

న్యూఢల్లీి,ఆగస్ట్‌3( జనం సాక్షి): అనేక దేశాల కన్నా భారత్‌ వృద్ధి గణాంకాలు మెరుగ్గా ఉన్నప్పటికీ… ఇక్కడి భారీ జనాభా ప్రకారం వృద్ధి మరింత అవసరమని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. పార్లమెంట్‌లో ధరల పెరుగుదలపై ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇచ్చిన వివరణపై ఆయన ఓ విూడియా సంస్థతో మాట్లాడారు. వృద్ధి రేటు దాదాపు 7 శాతంగా ఉండగా… ఆ వృద్ధి మనకు అవసరమైన ఉద్యోగాలకు సరిపడదని తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నడిపించే ఉద్యోగాలు, డిమాండ్‌ సహా సంబంధాలతో చూస్తే.. అభివృద్ధి ఉన్నప్పటికీ.. సామర్థ్య వినియోగం తక్కువగా ఉందని, ముందుకు సాగేందుకు మరింత డిమాండ్‌ అవసరమని అన్నారు. ఆర్థిక వృద్ధి 7 శాతం మామూలు విషయం కాదన్న ఆయన.. ఈ వృద్ధిలో చాలా వరకు నిరుద్యోగ వృద్ధి ఉందని, ఆర్థిక వ్యవస్థకు ఉద్యోగాలు టాస్క్‌ వంటివని వ్యాఖ్యానించారు. అందరూ సాప్ట్‌వేర్‌ ప్రోగ్రామర్స్‌ లేదా కన్సలెంట్‌గా ఉండాల్సిన అవసరమే లేదని, ఓ మంచి ఉద్యోగం ఉంటే చాలని పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడుతూ.. ’ఇక్కడ షార్ట్‌కట్‌లు లేవు. మన ప్రజల నైపుణ్యం, విద్యను పెంచాలి. మనం నైపుణ్యాన్ని సృష్టించగలిగితే.. అవకాశాలు వస్తాయి’ అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలతో చర్చలు గురించి స్పందిస్తూ.. అవి కీలకమని తెలిపారు. ఎటువంటి సంప్రదింపులు జరపకుండా నోట్లరద్దు, వ్యవసాయ బిల్లులు తెచ్చారని, కానీ విూరు చర్చించి నప్పుడు.. ఫలితం సాధిస్తారని అన్నారు. చర్చలు అంతులేనివిగా సాగనక్కర్లేదని, ప్రధాన మంత్రి కార్యాలయంలో కూర్చున్న బృందం కన్నా వాస్తవమేమిటో ప్రజలకు తెలుసునని చురకలు అంటించారు. కాగా, ఇటీవల రఘురామ్‌ రాజన్‌ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేయగా… దీనికి కౌంటర్‌గా నిర్మలా సీతారామన్‌ ఇటీవల ప్రసంగం సాగింది. ఎన్‌డిఎ ప్రభుత్వంలో పనిచేసినందున తనపై విమర్శలు వస్తున్నాయని, కొన్నిసార్లు విమర్శలు అవసరమేనని అంటూ విమర్శలు చేసేవారిని విమర్శకులని ముద్ర వేయవద్దని అన్నారు.