అనుష్క శర్మ సినిమా బావుంది: విరాట్

నా ప్రియురాలి సినిమా బావుంది: విరాట్
 ముంబై: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తన గార్ల్ ప్రెండ్ అనుష్క శర్మను బాహాటంగా పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆమె నటించిన హిందీ చిత్రం ఎన్ హెచ్ 10తాను చూశానని, ఆ చిత్రంలో అనుష్క నటన అదిరిపోయిందని, గతంలో ఎన్నడూ చేయని విధంగా చేసిందని మురిసిపోతూ కొనియాడాడు. ‘ఆహా ఏమాచిత్రం. మైండ్ బ్లోయింగ్. చాలా బ్రిలియంట్ ఫిల్మ్. ప్రత్యేకంగా అందులో నాలవ్ అనుష్క శర్మ నటన అత్యద్భుతం’అంటూ ప్రస్తుతం ప్రపంచ కప్ క్రికెట్తో తీరిక లేకుండా ఉన్న కోహ్లీ చెప్పాడు. గతంలో వీరి అనుబంధాన్నిగురించి ప్రశ్నించినప్పుడు చిరుబుర్రులాడే కోహ్లీ.. తాజాగా బహిరంగంగా తన ప్రేయసి.. ప్రేయసి అంటూ అభిప్రాయాలు వెలిబుచ్ఛడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.