అన్నా బృందం క్షమాపణకు మీడియా డిమాండ్‌

న్యూఢిల్లీ: అవినీతిపై పోరు, బలమైన లోక్‌పాల్‌ కోసం పోరాటంలో భాగంగా అన్నా హజారే ఆయన బృందం చేపట్టిన దీక్ష నేటికి మూడవరోజుకు చేరింది. గత రాత్రి జంతర్‌మంతర్‌ వద్ద మీడియా పై అన్నాబృందం దాడిని, వారి వ్యాఖ్యలను బ్రాడ్‌కాస్ట్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. తమ ఆందోళనను మీడియా సరిగా కవర్‌ చేయటంలేదంటూ గత రాత్రి అన్నా  మద్దతుదారులు మీడియాకు చెందిన బృందంపై దౌర్జన్యం చేశారు. తాము తమ విధులను సరిగానే నిర్వర్తిస్తున్నామని అన్నా బృందం తమ నిరంకుశ ప్రవర్తనకుగాను క్షమాపణ చెప్పాలని ఈ రోజు ఎడిటర్స్‌ అసోసియేషన్‌  డిమాండ్‌ వ్యక్తం చేసింది.