అన్ని దేశాలతో కలిసి పనిచేస్తా- ట్రంప్
అమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన విజయోత్సవ ప్రసంగం చేశారు. అమెరికా భవిష్యత్తుకోసం అంతా కలిసి పనిచేయవలసిన సమయం ఇదని ప్రతిపక్షానికి పిలుపునిచ్చారు. అమెరికాలో మౌలిక సదుపాయాలను పునర్నిర్మించుకుందామన్నారు. దేశాన్ని పునర్‌నిర్మించే పనిని సత్వరమే ప్రారంభిస్తానన్నారు. జాతీయాభివృద్ధి కోసం కృషి చేస్తానని, అన్ని దేశాలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుంటాం తప్ప శత్రుత్వాన్ని కాదని స్పష్టం చేశారు. తాను అందరికీ గర్వకారణమైన అధ్యక్షుడిగా ఉంటానని ట్రంప్ హామీ ఇచ్చారు. నాలుగు లేదా ఎనిమిదేళ్ల తర్వాత మీరు మంచి పని చేశారని గర్వపడేలా కృషి చేస్తానని తెలిపారు. ఇది చరిత్రాత్మక దినమని అంటున్నారని, కానీ దీనిని చరిత్రాత్మకంగా మార్చాలంటే మనమంతా గొప్పగా పని చేయవలసి ఉందని అన్నారు.