అన్యాక్రాంతం దేవాదాయభూములపై దృష్టి

భూదార్‌ ద్వారా వివరాల సేకరణ

అమరావతి,డిసెంబరు7(జ‌నంసాక్షి): రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందిన ఈనాం భూముల అన్యాక్రాంతంపై సర్కార్‌ చర్యలు తీసుకోబోతోంది.ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్‌ విజిట్‌ చేయగా అదనంగా మరో 35 వేల ఎకరాలు దేవాదాయశాఖ భూమి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ భూమి ఆక్రమణలో ఉందని, ట్రిబ్యునల్‌లో కేసులు వేసి వాటిని రక్షిస్తామని చెప్పారు. భూములకు సంబంధించి పొరపాట్లు ఉంటే జిల్లాస్థాయిలో విూటింగ్‌ ఏర్పాటు చేసి సంబంధిత ఆర్డీవో, తహశీల్దార్‌ ద్వారా వెరిఫికేషన్‌ రిపోర్టు తీసుకుని వాటిని పరిష్కరిస్తామన్నారు. భూదార్‌ ద్వారా వీటిని గుర్తించి ఆధీనంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. భూముల వివరాల ఆధారనంగా వాటిని స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్దం చస్తోంది. వందలాది కోట్ల రూపాయల భూములు పరుల హస్తగమైనా ఇంతకాలం పాలకులు పట్టించుకోలేదు. అలాగే కొన్ని చోట్ల నామినల్‌గా కౌలు చెల్లిస్తున్నారు. దీంతో ఆలయాల్లో ధూపదీప నైవేద్యం కష్టంగా మరింది. ఈ దశలో అలాంటి భూములను గుర్తించి వాటిని చేసుకునేందుకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు దేవాదాయ

శాఖ కమిషనర్‌ తెలిపారు. ఆయా గ్రామాల పరిధిలో ప్రజలు ఇచ్చేసమాచారం ఆధారంగా ఇంకా అన్యాక్రాంతంగా ఉన్న భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో దేవాదాయ భూమి 4 లక్షల 86 వేల ఎకరాలు ఉండగా అందులో 3.98 లక్షల ఎకరాలకు మాత్రమే రెవెన్యూ రికార్డులు ఉన్నాయని, మిగిలిన 88 వేల ఎకరాలు ఈనాం భూమిగా ఉందని, వీటికి పట్టాలు, పాసుపుస్తకాలు జారీ చేసి ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన వివాదాలు అధికంగా ఉన్నాయని చెప్పారు. ఆలయాల వారీగా ప్రొఫార్మా సిద్ధం చేస్తున్నట్లు

తెలిపారు. రాష్ట్రంలో అర్చకులు, సేవకుల వద్ద 1 లక్షా 11 వేల ఎకరాల భూమి ఉందని, ఈ భూమి అనేక చోట్ల అన్యాక్రాంతమైందని, వాటిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో 4 లక్షల 86 వేల ఎకరాల దేవాదాయభూమి ఉండగా అందులో రెవెన్యూ పరంగా 3.98 వేల ఎకరాలకు మాత్రమే రికార్డులు ఉన్నాయని తెలిపారు. మిగిలిన 1.27 వేల ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో దేవాదాయశాఖ భూములకు సంబంధించి వివాదాలు అధికంగా ఉన్నాయన్నారు. భూములకు సంబంధించిన ఏమైనా పొరపాట్లు ఉంటే జిల్లాస్థాయిలో విూటింగ్‌ ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని చెప్పారు. ఇక రాజధాని అభివృద్దిలో భాగంగా సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న దేవాలయాల భూములను 1087 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. సీఆర్‌డీఏ పరిధిలోని భూములపై ఆమె జిల్లా ఏసీ, ఆలయాల ఈవోలు, మేనేజర్లతో సవిూక్ష నిర్వహించారు. గ్రామాలకు సంబంధించిన భూములను మాత్రమే సీఆర్‌డీఏ అధికారులు తీసుకున్నారని, మిగిలిన భూములను తిరిగి ఇచ్చారని తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కేటాయించిన ఫ్లాట్లను, స్థలాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు.