అప్పటిదాకా మెక్’కల్లోలమే’

 హైదరాబాద్: తొలి ఐపీఎల్ సీజన్లో కోల్కత్తా నైట్రైడర్స్ జట్టు ఆటగాడు మెక్కల్లమ్ 158 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు నెలకొల్పాడు.  ఆ మ్యాచ్లో బెంగళూరు బౌలర్లపై 73 బంతుల్లోనే 13 సిక్సర్లు, 10 ఫోర్లతో తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. మెక్ చేసిన 158 పరుగులే ఐపీఎల్ – 6 వరకు రికార్డు. ఆరేళ్ల తర్వాత క్రిస్ గేల్ ఏకంగా ఈ రికార్డును బద్దలు చేయడంతో పాటుగా తక్కువ (30) బంతుల్లోనే 100 పరుగుల మార్కును చేరుకున్నాడు. బుధవారం జరిగే మ్యాచ్లో మెక్ కల్లోలం లేని లోటు ఏమైనా కనిపిస్తుందేమో చూడాలి. ఆరంభ సీజన్లలో కోల్కత్తా నైట్రైడర్స్ తరఫున ఆడిన ఈ డాషింగ్ ఓపెనర్ గత ఏడాది నుంచి  చెన్నై సూపర్ కింగ్స్ సరసన చేరిపోయాడు. ఈ జట్టు తరఫున ఎన్ని రికార్డులు బద్దలుకొడుతాడో చూడాలంటే గురువారం ఢిల్లీ డేర్డెవిల్స్తో మ్యాచ్ జరిగే వరకు వేచి ఉండాల్సిందే.