అభాగ్యులకు అండగా…ఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిధి
-పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం.
-సీఎం సహాయ నిధిని
సద్వినియోగం చేసుకోవాలి.
-అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం.
గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 10 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల పరిధిలోని గ్రామాల కు చెందిన 32 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుండి మంజూరు అయిన 7,29,500/-రూపాయల చెక్కులను బాధితులకు అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం చేతుల మీదుగా శనివారం అందజేశారు.
ఈ సదర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగిందనీ,సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుందనీ,ఆపదలో సీఎం సహాయ నీది ఆపద్భందువునిగ అదుకుంటుందనీ, మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారనీ,వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎనో కుటుంబాలకు ఈఫండ్ ఆసరాగా నిలుస్తుంది,బాధితులు అవసరమైన సమయంలలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినిమెాగపర్చుకొవాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కాశపోగు రాజు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంకల శీను గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ ప్రకాశ్ ,తనగల మహేంద్ర ,పచ్చర్ల రాజు,
రామాపురం నాయుడు ,
సంజివ, ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.