అభిమానం పోటెత్తింది: హైదరాబాద్‌దే గెలుపు అంటున్న విశాఖ యువత

hbwc2ekm విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ఐపీఎల్ హంగామాతో ఉరకలెత్తుతోంది. గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో విశాఖలోని వైయస్సార్ స్టేడియం అభిమానులతో నిండిపోనుంది. హైదరాబాదుదే గెలుపు అని ఉత్సాహంతో చెబుతున్నారు. హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ చూసేందుకు అభిమానులు బారులు తీరారు. టిక్కెట్లు దొరికిన వారి ఆనందానికి అంతేలేకుండా ఉంది. ఈ మ్యాచ్ చూసేందుకు పొరుగు రాష్ట్రాల నుండి కూడా అభిమానులు పోటెత్తారు. స్టేడియం పూర్తిగా నిండిపోనుంది. అభిమానం పోటెత్తింది: హైదరాబాద్‌దే గెలుపు అంటున్న విశాఖ యువత ఐపీఎల్ 8లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి మూడింట గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. హైదరాబాద్ రెండు మ్యాచ్‌ ఆడి ఒక మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడింది. ఇది రాజస్థాన్‌కు నాలుగో మ్యాచ్ కాగా, హైదరాబాదుకు మూడో మ్యాచ్. డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీ కొడతాడని, సన్ రైజర్స్ హైదరాబాదును గెలిపిస్తాడని విశాఖ క్రికెట్ అభిమానులు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. శిఖర్ ధావన్ కూడా రాణిస్తాడంటున్నారు. కాగా, రాజస్థాన్ జట్టులో దీపక్ హుడా సిక్సులతో చెలరేగుతున్న విషయం తెలిసిందే.