అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు
చింతలపాలెం జనంసాక్షి
సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండలం, దొండపాడు గ్రామంలో మెయిన్ రోడ్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైయస్సార్ జన్మదినం సందర్భంగా అభిమానులు నివాళులర్పించారు మరియు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు.అభిమానులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ అభిమానులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




