అభివృద్దిలో దూసుకుపోతున్న ఎపి
పోలవరంతో మారనున్న దశ: మంత్రి
ఏలూరు,డిసెంబర్31 (జనం సాక్షి) : పోలవరంతో ఎపి చరిత్రాత్మక ఘట్టానికి వేదికయ్యిందని మంత్రి శ్రీరంగనాథ రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే కాంక్రీట్ పనుల ప్రారంభంతో ఇక అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాగలదని అన్నారు. దీంతో ఎపి రూపురేఖలు మారనున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక, సమాచార విప్లవానికి నాంది అన్నారు. సాంకేతిక రంగంలో ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలో రాష్ట్రం అతివేగంగా ముందుకు దూసుకుపోతుందన్నారు. ఓ వైపు రాష్ట్రంలో ఇంతెత్తున అభివృద్ధి పనులు జరుగుతుంటే ఓర్వలేని ప్రతిపక్షనేత చంద్రబాబు అన్నింటికీ అడ్డుపడుతున్నారన్నారు. కొత్త సంవత్సరంలో అంతా సుఖశాంతులతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. సిఎం జగన్ చేస్తున్న కృషి వల్ల ఎపి పురోగమిస్తోందని, విభజన బాధల నుంచి బయటపడుతోందని అన్నారు. వచ్చేయేడు మరిన్ని మంచి పథకాలు,కార్యక్రమాలతో సిఎం జగన్ ప్రజలకు మేలు చేస్తారని అన్నారు. పోలవరంతో సాగునీటి సమస్యలకు చెక్ పడనుందన్నారు. శాఖలవారీగా ప్రభుత్వం చేపట్టిన
కార్యక్రమాలను, ప్రజలకు అందిస్తున్న ఫలాలను సచివాలయ కార్యదర్శులు ప్రజలకు వివరించాలన్నారు. ఇళ్లపట్టాలు పంపిణీకి రంగం సిద్ధం చేయాలని వారిని ఆదేశించారు. గ్రామాల్లో వచ్చే అర్జీలను రోజువారీగా తమకు నివేదిక పంపాలన్నారు.