అభివృద్ధిని అడ్డుకోవడమే మోడీ విజన్‌

– ఏపీ రాజకీయాలు కేసీఆర్‌కు ఏం అవసరం?
-ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు
కాకినాడ, జనవరి3(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే మోడీ విజన్‌ అని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం ఎండపల్లి, ఉప్పాడలో నాలుగు కోట్ల 20 లక్షలతో నిర్మించిన తుఫాన్‌ షెల్టర్లను యనమలతో పాటు ఎమ్మెల్యే వర్మ లు ప్రారంభించారు. ఎండపల్లిలో జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో మంత్రి యనమల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రాకుండా ఆపేసి రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టడమే మోడీ ఉద్దేశమని తెలిపారు. ఏపీ రాజకీయాలు కేసీఆర్‌ కు అవసరం ఏంటని ప్రశ్నించారు. మోడీ, జగన్‌, కేసీఆర్‌ ముగ్గురు ఏపీ అభివృద్ధిని అడ్డుకోడానికినికి శతవిధాల
ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.  చంద్రబాబును అడ్డుకునేందుకు ఎవరెన్ని కుయుక్తులు పన్నినా ఫలించబోవని చెప్పారు. చంద్రబాబు విజయాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదని అన్నారు. జగన్‌ కు సీఎం కుర్చీనే ప్రధానమని, ప్రజా సమస్యలు ఆయనకు పట్టవన్నారు. నాలుగేళ్ల కాలంలో జగన్‌ ప్రజల గురించి ప్రతిపక్ష ¬దాలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకిరాకుండా బయట తిరుగుతున్నారని విమర్శించారు. జగన్‌కు ప్రతిపక్ష ¬దా కూడా ఎక్కువేనని ప్రజలు భావిస్తున్నారని, ఈ దఫా ఆ స్థానాన్ని కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. విశాఖపట్నంకు వెళ్లినప్పుడు వేల మంది, లక్షల మంది డాబాలపై నిల్చుని తనకు స్వాగతం పలికారని… చంద్రబాబును ఓడించి మంచి పని చేశారని తనతో చెప్పారని కేసీఆర్‌ ఇటీవల చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. విశాఖలో విూకోసం వేల మంది వచ్చారని చెప్పుకోవడం కంటే పెద్ద అబద్ధం లేదని అన్నారు. కేసీఆర్‌ అబద్ధాలు చెబుతారనేదానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏపీలో తెదేపా క్వీన్‌స్లిప్‌ చేస్తుందని యనమల జోస్యం చెప్పారు.