అభివృద్ధి పనులకు రూ.232 కోట్లు మంజూరు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 : జిల్లాలో మారుమూల గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులకు  232 కోట్లు మంజూరు అయినట్లు ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. తీవ్రవాద ప్రవాహిత ప్రాంత అభివృద్ధి పథకం కింద 231.92 కోట్లు మంజూరు అయ్యాయని, ఈ నిధులను గ్రామాలలోని రోడ్లు, తాగు నీటి పథకాల కోసం ఖర్చు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో వివిధ గ్రామాలలో 75 పనులలో 233 రోడ్ల నిర్మాణానికి 111.92 కోట్ల రూపాయలు, తాగు నీటి పథకాల కోసం 120 కోట్లు కేటాయించిడం జరిగిందని అన్నారు. త్వరలో ఈ పనులకు టెండర్లను పిలిచి పనులు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.