అభివృద్ధి పనులకు రూ.74.66 కోట్లు మంజూరు
ఆదిలాబాద్, జూలై 10 : జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు 74.66 కోట్లు మంజూరు అయినట్లు ఆసిఫాబాద్ శాసన సభ్యుడు ఆత్రం సక్కు తెలిపారు. ఆసిఫాబాద్ మినీస్టేడియం నిర్మాణానికి 2.10 కోట్లు , సీసీ రహదారులు, మురుగు కాల్వల నిర్మాణాలకు రెండు కోట్లు, మట్టివాగు, చెలిమెలప్రాజెక్టు మరమ్మతుల కోసం రూ.90 లక్షలు, హాస్టల్ భవనాల నిర్మాణాల కోసం రూ. రెండు కోట్లు, ఉట్నూరులో బీఏడ్, పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి 6 కోట్లు, మంజూరు అయినట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పాఠశాలలో అదనపు గదులన నిర్మాణాలకు 2.10 కోట్లు, గిరిజనుల భూముల సాగు కోసం రూ.41 కోట్లు విడుదల అయ్యాయని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.